: ఒంటిమామిడి దగ్గర జానారెడ్డి, షబ్బీర్ అలీ అరెస్ట్
మల్లన్నసాగర్‌కు వెళుతోన్న నేతల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. మల్లన్నసాగర్ కారణంగా పోలీసులతో లాఠీ దెబ్బలు తిన్న రైతులను పరామర్శించడానికి వెళుతోన్న టీపీసీసీ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీలను ఈరోజు పోలీసులు అరెస్టు చేశారు. పలువురు కార్యకర్తలతో కలిసి బయలుదేరిన నేతలను మెదక్ జిల్లా ఒంటిమామిడి దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, నేతలకు మధ్య వాగ్వివాదం జరిగినట్లు తెలుస్తోంది. నేతలను అరెస్టు చేసిన పోలీసులు వారిని మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌కి తరలించారు.