: తెలంగాణ సచివాలయం ఎదుట ఎంసెట్ ర్యాంకర్ల బైఠాయింపు.. ఉద్రిక్తత


తెలంగాణ సచివాలయం వద్ద ఈరోజు ఉద్రిక్త వాతావ‌ర‌ణం చోటుచేసుకుంది. తెలంగాణ‌ ఎంసెట్-2 ర‌ద్దు చేయొద్దంటూ ఎంసెట్ ర్యాంక‌ర్లు, వారి త‌ల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు స‌చివాల‌యానికి పెద్ద ఎత్తున రావ‌డంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ‘దోషుల్ని శిక్షించండి.. విద్యార్థుల‌ను కాదు’ అంటూ విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు నినాదాలు చేస్తూ, స‌చివాల‌యం ముందు బైఠాయించారు. దీంతో ప‌లువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమ పిల్లలు ఎంతో ఒత్తిడికి గురవుతున్నారని తల్లిదండ్రులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు మినిస్ట‌ర్స్ క్వార్ట‌ర్స్ వ‌ద్ద యూత్ కాంగ్రెస్ ఇదే అంశంపై ఆందోళ‌న‌కు దిగింది. వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News