: బురదలో కూరుకుపోయిన తెలంగాణ మంత్రి కారు... పరుగులు తీసిన అధికారులు


అర్గుల్ రాజారాం గుత్ప ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేసేందుకు బయలుదేరిన తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కారు నిజామాబాద్ జిల్లాలో బురదలోకి కూరుకుపోయి, బయటకు రాకపోవడంతో అధికారులు పరుగులు తీయాల్సి వచ్చింది. జిల్లాలోని నందిపేట మండలం, ఉమ్మెడ శివారు ప్రాంతాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షానికి మట్టి రోడ్లన్నీ మెత్తగా అయిపోయి, బురదతో నిండిపోగా, అదే దారిలో పోచారం కాన్వాయ్ బయలుదేరాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే లిఫ్ట్ కు వెళ్లే దారిలో నందిపేట పోలీస్ ఎస్కార్ట్ వాహనంతో పాటు పోచారం వాహనం కూడా కూరుకుపోయింది. డ్రైవర్లు ఎంత ప్రయత్నించినా, వాహనాలను బయటకు తీయలేకపోవడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో అదే బురదలో మంత్రి పోచారం, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డిలు దిగాల్సి వచ్చింది. ఆపై అధికారులు, కార్యకర్తలు తలో చెయ్యి వేసి వాహనాన్ని నెట్టారు. రహదారుల పరిస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పోచారం, తిరుగు ప్రయాణంలో వేరే దారిలో వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News