: ఇంటరాగేషన్ సమయంలో నిందితుడిని కొరికిన పోలీసు.. చికిత్స పొందుతున్న బాధితుడు
దర్యాప్తు సందర్భంగా నిందితుడిని ప్రశ్నిస్తున్న ఓ పోలీసు సహనం కోల్పోయి అతడిని కొరికి గాయపరిచాడు. తమిళనాడులోని రామనాథపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ కేసులో నిందితుడైన వి.కార్తీక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కెనికరై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. కేసు విషయమై సురేష్ అనే కానిస్టేబుల్ కార్తీక్‌ను ప్రశ్నిస్తున్నాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన కానిస్టేబుల్ సురేష్ సహనం కోల్పోయి నిందితుడు కార్తీక్‌పై పడి ఇష్టానుసారం కొరికాడు. తీవ్ర గాయాలపాలైన కార్తీక్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. తుపాకి అదృశ్యం కేసులో సురేష్‌పై ఇప్పటికే ఓ కేసు ఉంది.