: 100 మందికి లబ్ధి... చేతులు మారిన రూ.80 కోట్లు!: కలకలం రేపుతున్న టీ ఎంసెట్-2 లీకేజీ!
తెలంగాణవ్యాప్తంగా కలకలం రేపుతున్న ఎంసెట్-2 పేపర్ లీకేజీలో దిమ్మ తిరిగే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. దాదాపు వంద మంది విద్యార్థులకు లబ్ధి చేకూరిందని భావిస్తున్న ఈ కుంభకోణంలో ఏకంగా రూ.80 కోట్లు చేతులు మారినట్లు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న తెలంగాణ సీఐడీ అధికారులు భావిస్తున్నారు. ఇక ఈ కేసులో పాత్ర ఉందన్న అనుమానంతో అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితులను కోర్టు ఆదేశాలతో చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు ప్రధాన నిందితుడు ఖలీల్ కోసం ముమ్మర గాలింపు చేపడుతున్నారు.