: తెలంగాణ సీఎం కేసీఆర్ సెక్యూరిటీ అధికారి దుర్మరణం!... మిస్ ఫైరే కారణమట!
హైదరాబాదు శివారు ప్రాంతం రంగారెడ్డి జిల్లా మొయినాబాదు ఫైరింగ్ రేంజ్ లో జరిగిన మిస్ ఫైర్ ఘటనలో తెలంగాణ సీఎం కేసీఆర్ సెక్యూరిటీ అధికారి వాసుదేవరెడ్డి దుర్మరణం పాలయ్యారు. తుపాకీని శుభ్రం చేస్తున్న క్రమంలో వాసుదేవరెడ్డి చేతిలోని తుపాకీ నుంచి బుల్లెట్ దూసుకువచ్చింది. ఈ బుల్లెట్ గాయం కారణంగా వాసుదేవరెడ్డి అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు కూడా గాయాలైన విషయం నేటి ఉదయమే వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ విషయానికి సంబంధించి గోప్యత పాటించడంతో వాసుదేవరెడ్డి మరణం వార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.