: కేసీఆర్ సెక్యూరిటీ అధికారి చేతిలో గన్ మిస్ ఫైర్!... ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలు!


హైదరాబాదు శివారులోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫైరింగ్ రేంజ్ లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ సెక్యూరిటీ అధికారి వాసుదేవరెడ్డి చేతిలోని గన్ మిస్ ఫైరైంది. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఫైరింగ్ రేంజ్ లోని ఇండోర్ రేంజ్ లో జరిగిన ఈ ఘటనపై ఇంటెలిజెన్స్ వర్గాలు గోప్యతను పాటిస్తున్నాయి. ఈ ఘటనపై ఎలాంటి వివరాలు వెల్లడించేందుకైనా ఆ శాఖ వర్గాలు నిరాకరిస్తున్నాయి. మిస్ ఫైర్ లో గాయపడ్డ ఇద్దరు కానిస్టేబుళ్లను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News