: స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధాని మోదీపై దాడికి టెర్రరిస్టుల కుట్ర?
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీపై టెర్రరిస్టులు దాడి చేసేందుకు కుట్ర పన్నుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. డ్రోన్ ద్వారా ఎర్రకోటపై దాడి చేేసేందుకు లష్కర్ ఏ తోయిబా(ఎల్ ఈటీ), జైషే మహమ్మద్ (జేఈఎం) లాంటి ఉగ్రవాద సంస్థలు చేతులు కలిపాయని నిఘా వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆగస్టు 15వ తేదీ ఉదయం ఎర్రకోటపై నుంచి జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించే సమయంలో ఈ దాడి చేయాలని ఉగ్రవాద సంస్థలు కుట్రపన్నుతున్నట్లు తెలుస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాల నివేదిక ద్వారా తెలుస్తోంది.