: రాజ్ నాథ్ పాక్ పర్యటనను స్వాగతించిన ఒమర్ అబ్దుల్లా
కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాకిస్థాన్ పర్యటనను జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్వాగతించారు. ట్విట్టర్ ద్వారా రాజ్ నాథ్ సింగ్ పాక్ పర్యటనపై స్పందించిన ఆయన... రెండు రోజుల పాక్ పర్యటనకు రాజ్ నాథ్ వెళ్లడం శుభపరిణామమని పేర్కొన్నారు. భారత్, పాక్ మధ్య చర్చలు కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. కాగా, సార్క్ దేశాల సదస్సు నేపథ్యంలో పాకిస్థాన్ లో రెండు రోజుల పర్యటనకు రాజ్ నాథ్ సింగ్ వెళ్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 3న ఇస్లామాబాద్ లో సార్క్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ జరుతుంది. ఇందులో పాల్గొనేందుకు ఆయన పాక్ కు వెళ్తున్నారు.