: ఆంధ్రా- ఒడిస్సా సరిహద్దు అడవిలో చిక్కుకుపోయిన హైదరాబాదీ కుటుంబం
విశాఖపట్టణం జిల్లాలోని అరకులోయ అందాలను చూసేందుకు వెళ్లిన హైదరాబాద్ లోని దిల్ షుక్ నగర్ కు చెందిన ఒక కుటుంబం చిక్కుల్లో పడింది. అరకు పర్యటన నిమిత్తం వారంతా కలసి ఒక వాహనంలో వెళ్లారు. ప్రకృతి అందాలను చూస్తూ ఒడిశా రాష్ట్రంలోకి ప్రవేశించారు. అయితే, వారు ప్రయాణిస్తున్న వాహనం చెడిపోవడంతో ఆ కుటుంబం కాలినడకన బయలుదేరారు. ఈ క్రమంలో దారి తప్పిన వారు ఆంధ్రా- ఒడిస్సా సరిహద్దు (ఏఓబీ) లోని అటవీ ప్రాంతంలో చిక్కుకుపోయారు. తమను రక్షించి, ఇక్కడి నుంచి బయటపడేయాలని బాధిత కుటుంబం సెల్ ఫోన్ ద్వారా కోరుతోంది.