: ములాయం సింగ్ యాదవ్ నియోజకవర్గంలో రూ.15 కోసం దళిత దంపతుల హత్య


ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ నియోజకవర్గం మెయిన్‌పురిలో ద‌ళిత దంప‌తులు దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. కేవ‌లం 15 రూపాయ‌ల కోసం ఆ దంప‌తుల‌ను ఓ దుకాణ య‌జ‌మాని క‌త్తితో దాడి చేసి దారుణంగా చంపేశాడు. నిందితుడి దుకాణంలో దళిత దంపతులు ఇటీవ‌లే పదిహేను రూపాయల స‌రుకులు అప్పుగా కొనుగోలు చేశారు. తిరిగి 15 రూపాయ‌లు వారు చెల్లించ‌లేదు. దీనిపై నిప్పులు క‌క్కుతూ వ‌చ్చిన షాపు యజమాని డ‌బ్బులెందుకు ఇవ్వ‌డం లేద‌ని ప్ర‌శ్నిస్తూ వారిద్దరిపై కత్తితో విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేశాడు. దీంతో ఆ దంప‌తులు మృతి చెందారు. దీనిపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు షాపు యజమానిని అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News