: 10 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఏపీ ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్
ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రసన్న కుమార్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. బీఎడ్ కాలేజీల నుంచి వెరిఫికేషన్ కు సంబంధించి ప్రతి విద్యార్థి నుంచి వెయ్యి రూపాయల చొప్పున మొత్తం 10 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా ప్రసన్న కుమార్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పూనం మాలకొండయ్య ఆదేశాల మేరకు ప్రసన్నకుమార్ పై నిఘా వేసిన డీఎస్పీ రమాదేవి రెడ్ హ్యాండెడ్ గా ఆయనను పట్టుకున్నారు. బీఎడ్, డీఎడ్ కాలేజీల్లో మేనేజ్ మెంట్ కోటాలో జాయినయ్యే ప్రతి విద్యార్థి నుంచి వెయ్యి రూపాయల చొప్పున ఆయన వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో అతనిపై కేసు నమోదు చేశామని, విచారణ అనంతరం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా, ఈ ఘటనతో తనకు సంబంధం లేదని ప్రసన్న కుమార్ తెలిపారు. ఆ డబ్బులు ఎవరో తెచ్చుకుంటే తనవని అంటున్నారని ఆయన పేర్కొన్నారు.