: హైదరాబాద్ లో మిస్టర్ వరల్డ్ రోహిత్ కు ఘనస్వాగతం
మిస్టర్ వరల్డ్ గా ఎంపికైన తొలి భారతీయుడు రోహిత్ ఖండేవాల్ ఈరోజు హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రోహిత్ కు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ, మిస్టర్ వరల్డ్ గా ఎంపికవడం హైదరాబాద్ వాసిగా తన కెంతో గర్వంగా ఉందని అన్నారు. ఈ విజయం భారత ప్రజలందరిదీనని, నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్య అందించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని రోహిత్ చెప్పారు.