: తైవాన్ నుంచి చెన్నైకు వచ్చిన పార్శిల్ లో కొండ చిలువ


చెన్నైలోని కేకే నగర్ లో నివాసం ఉండే సంతోష్ అనే వ్యక్తికి తైవాన్ నుంచి వచ్చిన ఒక పార్శిల్ లో పిల్ల కొండ చిలువ ఉండటాన్ని తపాలా శాఖాధికారులు గుర్తించారు. ఈ పార్శిల్ రెండు రోజుల క్రితం మీనంబాక్కంలోని అంతర్జాతీయ తపాలా శాఖ కార్యాలయానికి వచ్చింది. అయితే, ఇక్కడి నుంచి విదేశాలకు పంపే వాటిని, అదేవిధంగా విదేశాల నుంచి ఇక్కడికి వచ్చే పార్శిల్ లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఈ క్రమంలో సంతోష్ కు వచ్చిన పార్శిల్ ను కూడా అధికారులు స్కాన్ చేయగా అందులో ప్రమాదకర వస్తువులున్నట్లు వారు గుర్తించారు. దీంతో, ఆ అట్టపెట్టె పార్శిల్ ను కస్టమ్స్ అధికారులకు తపాలా శాఖ అధికారులు అప్పగించారు. తపాలా విభాగం సహాయ కమిషనర్ చంద్రశేఖర్ సమక్షంలో కస్టమ్స్ అధికారులు తెరచి చూడగా అందులో ఒక అడుగు పొడవు గల కొండ చిలువ ఉండటంతో ఆశ్చర్యపోయారు. ఈ కొండచిలువను అక్రమంగా తైవాన్ నుంచి ఇక్కడికి తరలిస్తున్నట్లు తెలియడంతో, దానిని వన్యప్రాణుల సంరక్షణా కేంద్రానికి అప్పగించారు.

  • Loading...

More Telugu News