: విచారణ పూర్తయ్యాకే నిర్ణయం: ఎంసెట్-2 లీకేజీపై కడియం శ్రీహరి
తెలంగాణ ఎంసెట్-2 లీకేజీపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఈరోజు వరంగల్లో ఆయనను పలువురు ఎంసెట్ ర్యాంకర్లు, వారి తల్లిదండ్రులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లీకేజీపై సీఐడీ నుంచి నివేదిక అందాకే ప్రభుత్వం స్పష్టమయిన ప్రకటన చేస్తుందని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొనే తాము నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. విద్యార్థులకు అన్యాయం చేయబోమని అన్నారు. మరోవైపు వీసీల నియామకం రద్దుపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన స్పందిస్తూ.. తీర్పుపై ఇప్పుడే మాట్లాడలేమని అన్నారు.