: సచివాలయం వద్ద ఆందోళనకు దిగిన ఎంసెట్ ర్యాంకర్లు, తల్లిదండ్రులు
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీక్ అయిన వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్-2 పరీక్ష రద్దు చేయాలా..? వద్దా..? అన్న అంశంపై సమాలోచనలు చేస్తోన్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని సచివాలయం వద్ద ఎంసెట్ ర్యాంకర్లు, వారి తల్లిదండ్రులు ఈరోజు ఆందోళనకు దిగారు. పరీక్షను రద్దు చేయొద్దంటూ వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అవసరమయితే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. తాము ఎంతో ఒత్తిడిని ఎదుర్కుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.