: రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీ గుండెపోటుతో మృతి


తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీ సత్యనారాయణరెడ్డి (38) గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు మాట్లాడుతూ, సత్యనారాయణరెడ్డి ఈరోజు ఉదయం గుండెపోటుతో మృతి చెందిన విషయాన్ని జైలు సిబ్బంది గుర్తించి తమకు సమాచారం అందజేశారని చెప్పారు. ఖైదీ మృతిపై అతని కుటుంబసభ్యులకు సమాచారం అందించినట్లు చెప్పారు. కాగా, గంజాయి అక్రమ రవాణా కేసులో మూడు రోజుల కిందట సత్యనారాయణ రెడ్డిని అరెస్టు చేసి రిమాండుకు పంపారు.

  • Loading...

More Telugu News