: పాక్‌‌లో పర్యటించనున్న రాజ్‌నాథ్ సింగ్.. సార్క్ సమావేశంలో పాల్గొననున్న హోంమంత్రి


భారత హోంమంత్రి రాజనాథ్‌సింగ్ ఆగస్టు 3న పాకిస్థాన్‌లో పర్యటించనున్నారు. ఇస్లామాబాద్‌లో జరగనున్న సార్క్ అంతర్గత, హోం మంత్రుల కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొంటారు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో జరిగిన ఉగ్రదాడి, బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్, కశ్మీర్ అల్లర్ల నేపథ్యంలో పాక్, భారత్ మధ్య ప్రస్తుత పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్ పాక్ పర్యటనపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. రెండు రోజుల పాటు పాక్‌లో పర్యటించనున్న రాజ్‌నాథ్ సార్క్ సమావేశం అనంతరం పాక్ ప్రభుత్వంతో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News