: ప్రభుత్వానికి భూములు కావాలంటే... ప్రజల అంగీకారం అవసరం లేదు: హరీష్ రావు
2013 భూసేకరణ చట్టమైనా ఇంకే చట్టమైనా సరే... ప్రభుత్వానికి, రైల్వే శాఖకు ప్రజల అంగీకారం అవసరం లేదని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ, ప్రైవేటు ప్రాజెక్టు నిర్మాణానికి భూసమీకరణకు 80 శాతం స్థానిక ప్రజలు అంగీకరించాలని, భూసేకరణకు అయితే 70 శాతం ప్రజలు అంగీకరించాల్సిన అవసరం ఉంటుందని అన్నారు. ప్రభుత్వాలకు భూములు కావాలంటే అంగీకారంతో సంబంధం లేకుండా భూసేకరణ చేయవచ్చని ఆయన చెప్పారు. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం అలాంటి చట్టాలతో పని లేకుండా వేగవంతంగా భూసేకరణ చేసేందుకు 123 జీవోను తీసుకువచ్చిందని, డబుల్ బెడ్రూం ఫ్లాట్స్ నిర్మాణం జరిగిన తరువాత మాత్రమే నిర్వాసితులను గ్రామాలను విడిచి వెళ్లమని చెబుతున్నామని అన్నారు. ఈ ఫ్లాట్స్ నిర్మాణం గతంలో జరిగిన ఇళ్ల నిర్మాణం తరహాలో కాకుండా అద్భుతమైన తరహాలో జరుగుతోందని ఆయన తెలిపారు.