: అసదుద్దీన్ ఒవైసీకి వైశాలి జిల్లా కోర్టు సమన్లు


ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీకి బీహార్ లోని వైశాలి జిల్లా న్యాయస్థానం సమన్లు పంపించింది. ముంబై పేలుళ్ల నిందితుడు యాకూబ్ మెమన్ కు ఉరిశిక్ష అమలు చేయడంపై ఒవైసీ స్పందిస్తూ, రాజీవ్ హంతకులకు, 2002 గుజరాత్ అల్లర్ల దోషులకు ఎందుకు ఉరిశిక్ష వేయలేదంటూ చేసిన వ్యాఖ్యలపై హాజీపూర్ కు చెందిన న్యాయవాది రాజీవ్ కుమార్ శర్మ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన న్యాయస్థానం, ఈ కేసు తదుపరి విచారణకు స్వయంగా హాజరుకావాలని ఆదేశించింది. అనంతరం ఈ కేసులో తదుపరి విచారణ ఈ నెల 11న జరగనుందని, ఆరోజు కోర్టులో స్వయంగా న్యాయస్థానానికి హాజరుకావాలని సమన్లలో స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News