: పరీక్ష రద్దు చేస్తారా?... ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీపై మంతనాలు
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీక్ అయిన వ్యవహారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కి అధికారులు నివేదిక అందించారు. ఎంసెట్-2 పరీక్ష రద్దు చేయాలా..? వద్దా..? అన్న అంశంపై రేపు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. లీకేజీపై ప్రభుత్వ వర్గాలు విస్తృత స్థాయిలో సమాలోచనలు చేస్తున్నాయి. గతంలో ప్రవేశపరీక్షలు లీకైన ఉదంతాలను తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది. మంత్రి లక్ష్మారెడ్డి లీకేజీ వ్యవహారంపై అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి జేఎన్టీయూహెచ్ వీసీ కూడా హాజరయ్యారు. అన్ని కోణాల్లో లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది.