: తన ఫేవరెట్ స్టార్‌తో ఫోటో దిగి మురిసిపోయిన సన్నీలియోన్
బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్ తన అభిమాన స్టార్ ప్రముఖ రెజ్లర్ గ్రేట్ ఖలిని కలిసింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంటూ తెగ మురిసిపోయింది. సన్నీలియోన్ తన భర్త డానియల్ వెబర్ తో కలిసి జాలీగా దుబాయ్ ట్రిప్‌కి వెళ్లింది. ఈ సందర్భంగా విమానంలో తనకు తన ఫేవరెట్ స్టార్ గ్రేట్ ఖలి కలిశాడు. దీంతో ఆయనతో ఫోటో దిగిన సన్నీ ఆ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసి హర్షం వ్యక్తం చేసింది. తాను దుబాయ్‌లో జాలీగా గడుపుతుండగా తీసిన పలు ఫోటోలను కూడా ఆమె షేర్ చేసింది.