: అందరూ అడుగుతున్నారు...అందుకే 'జక్కన్న'లో ఆ లోటు తీర్చా: సునీల్


కామెడీ పాత్రలతో తెలుగు సినిమాల్లో నిలదొక్కుకున్న తాను హీరోగా మారిన తరువాత కామెడీ తగ్గించానని పలువురు ఆరోపిస్తున్నారని సునీల్ అన్నాడు. ఫేస్ బుక్, ట్విట్టర్ లో కూడా దీనిపై చాలా మంది తనను ప్రశ్నించారని సునీల్ చెప్పాడు. అందుకే ఈ సారి కామెడీ లోటు తీర్చాలని భావించి 'జక్కన్న' సినిమాలో నటించానని తెలిపాడు. ధియేటర్ కు వచ్చిన ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుకునేలా ఈ సినిమాలో సన్నివేశాలు ఉంటాయని సునీల్ వెల్లడించాడు. సినిమాలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని సునీల్ చెప్పాడు. ఫస్ట్ హాఫ్ లో ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేస్తే, సెకెండ్ హాఫ్ కామెడీతో కడుపుబ్బ నవ్విస్తుందని సునీల్ పేర్కొన్నాడు. తన నుంచి ప్రేక్షకులు ఆశించే కామెడీని అందించేందుకు తమ యూనిట్ మొత్తం సిద్ధమైందని అన్నాడు. 'జక్కన్న' సినిమా వచ్చేవారం ప్రేక్షకుల ముందుకు రానుందని, తమను ఆశీర్వదించాలని సునీల్ తెలిపాడు.

  • Loading...

More Telugu News