: వీసాకు అప్లై చేసినప్పుడు ఆ కాపీ నాకు పంపించండి: ఇండియా కోడలికి సుష్మ ట్వీట్


విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తన శాఖకు సంబంధించిన సమస్య మీడియాలో కనిపించిన వెంటనే ఆమె సోషల్ మీడియా ద్వారా స్పందిస్తారు. తాజాగా ఆమె హర్యానాలోని ఫతేబాద్ కు సమీపంలో గల సమైన్ అనే గ్రామానికి చెందిన దంపతుల దుస్థితిపై స్పందించిన ఘటన వారిలో ఆనందం కలిగించింది. వివరాల్లోకి వెళ్తే...సమైన్ గ్రామానికి చెందిన టినుకు కజకిస్థాన్ కు చెందిన జహానా అనే మహిళ ఏడాది క్రిందట ఫేస్ బుక్ ద్వారా పరిచయమైంది. ఎనిమిది నెలల క్రితం టిను సౌదీ అరేబియా వెళ్లినప్పుడు అతనిని వివాహం చేసుకునేందుకు జహానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివాహం తరువాత ఇండియాలోనే సెటిలవుదామని టిను ఆమెకు స్పష్టం చేశాడు. దీనికి అంగీకరించిన ఆమె టూరిస్టు వీసాపై భారత్ కు గత జూన్ లో వచ్చింది. అనుకున్న ప్రకారమే ఇద్దరూ వివాహం చేసుకున్నారు. జూలైతో ఆ గడువు ముగుస్తోంది. దీంతో ఆమె కజికిస్థాన్ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. వీరి పరిస్థితిని వివరిస్తూ హిందీ దినపత్రిక ఒక కథనం ప్రచురించింది. దీనిని చూసిన సుష్మా స్వరాజ్..ఆ పేపర్ క్లిప్పింగ్ ను జత చేస్తూ...ఇండియన్ కోడలు అని జహానాను సంబోధిస్తూ...వీసా పొడిగింపుకు దరఖాస్తు చేసుకుంటే...ఆ పత్రాలు తనకు పంపాలని సూచించారు. దీంతో ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాగా, కేంద్ర మంత్రి సురేష్ ప్రభులానే సుష్మ కూడా సమస్యలపై వెంటనే స్పందించడం అందర్నీ ఆకట్టుకుంటోంది.

  • Loading...

More Telugu News