: విరసం నేత వరవరరావు సహా పలువురు నేతల అరెస్ట్
పోలీసులతో లాఠీ దెబ్బలు తిన్న రైతులను పరామర్శించేందుకు బయలుదేరుతోన్న నేతల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈరోజు అక్కడికి బయలుదేరిన విరసం నేత వరవరరావును పోలీసులు అరెస్టు చేశారు. మెదక్ జిల్లా కొండపాక మండలం కోనాయిపల్లి వద్ద ఆయనను పోలీసులు మల్లన్నసాగర్ ప్రాంతానికి వెళ్లకుండా అడ్డుకుని, పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఆయనతో పాటు ప్రజాఫ్రంట్ నాయకులు డా.కాశీం, రవిచంద్ర, దేవేంద్ర, గీతాంజలి, నలమాస కృష్ణ, రమణాచారి తదితరులను అదుపులోకి తీసుకున్నారు.