: గుంటూరు జిల్లా దాచేపల్లిలో 'కబాలి' సినిమా ప్రదర్శిస్తుండగా థియేటర్లో మంటలు!
రజనీకాంత్ తాజా చిత్రం 'కబాలి' ప్రదర్శిస్తున్న వేళ, ఓ సినిమా హాల్ మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటన గుంటూరు జిల్లా దాచేపల్లిలో జరిగింది. ఇక్కడ కబాలి ప్రదర్శింపబడుతున్న అలంకార్ థియేటర్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో అగ్నికీలలు ఎగిశాయి. దీంతో ప్రదర్శన నిలిపివేసిన యాజమాన్యం ప్రేక్షకులను బయటకు పంపింది. ఈలోగానే మంటలు మరింతగా పెరగగా, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే పనిలో ఉన్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.