: సంస్కరణలను వ్యతిరేకిస్తూ 29న బ్యాంకుల సమ్మె


ప్రభుత్వం బ్యాంకింగ్ రంగంలో ప్రవేశపెడుతున్న కొన్ని పాలసీలను, సంస్కరణలను వ్యతిరేకిస్తూ ఈ నెల 29న బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) నిన్న బ్యాంకు అధికారులతో నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ఒక్కరోజు సమ్మెకు పిలుపు నిచ్చినట్లు బ్యాంకు యూనియన్ల ఫోరం వెల్లడించింది. అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ (ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు బ్యాంకులు, విదేశీ బ్యాంకులకు చెందిన వేలాది ఉద్యోగులు కూడా ఈ సమ్మెలో పాల్గొననున్నారు.

  • Loading...

More Telugu News