: ఎంసెట్ 2 పేపర్ లీక్ కు కడియం బాధ్యత వహించాలి: మల్లు రవి
ఎంసెట్ 2 క్వశ్చన్ పేపర్ లీక్ ను ముందే ఊహించామని కాంగ్రెస్ నేత మల్లు రవి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, అక్రమ సంపాదనకు ఆశపడిన కొంత మంది స్వార్థపరులు విద్యార్థుల భవిష్యత్ తో ఆటలాడుకున్నారని అన్నారు. ఎంసెట్ 2 పేపర్ లీకేజీ పట్ల ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని పేర్కొన్నారు. ఈ ప్రశ్నాపత్రం లీకేజీకి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి బాధ్యత వహించాలని ఆయన తెలిపారు. ప్రశ్నా పత్రాలు విద్యార్థులకు ముందే అందాయని సీఐడీ విచారణలో తేలిందని తెలిసిందని ఆయన చెప్పారు. ప్రశ్నాపత్రం లీక్ ఘటనతో ప్రమేయమున్న వారందర్నీ కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంసెట్ 2 లీకేజీలో మరిన్ని వివరాల కోసం ఎదురుచూస్తున్నామని, అన్నీ చూసిన తరువాత నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.