: చిన్నారి రమ్య కుటుంబానికి రూ.12 లక్షల చెక్కును అందించిన ఎమ్మెల్యే దాస్యం
పంజాగుట్ట ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి రమ్య కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఈరోజు ఆర్థిక సాయం అందింది. మృతి చెందిన చిన్నారి రమ్య ఇంటికి చేరుకున్న ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ ఆమె కుటుంబ సభ్యులకు రూ.12 లక్షల చెక్కును అందించారు. పట్టపగలే మైనర్లు తాగి డ్రైవింగ్ చేయడంతో ప్రమాదం జరిగి అభం శుభం తెలియని చిన్నారి రమ్య చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. అదే ప్రమాదంలో పమ్మి రాజేష్(34) అక్కడికక్కడే మృతి చెందగా, రమ్యతో పాటు తీవ్రంగా గాయపడిన ఆమె తాత మధుసూదనాచారి(65) కూడా చికిత్స పొందుతూ మృతిచెందారు.