: రజనీ సార్ నన్ను చూడగానే సాదరంగా ఆహ్వానించారు: నటి రాధికా ఆప్టే


‘కబాలి’ ఫొటో షూట్ కోసం చెన్నై వెళ్లినప్పుడు తనను చూడగానే రజనీకాంత్ సాదరంగా ఆహ్వానించారని నటి రాధికా ఆప్టే గుర్తు చేసుకుంది. ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘కబాలి’ చిత్రం ఫొటో షూట్ కోసం తాను వెళ్లిన సమయంలో రజనీ సార్ రెడీ అయి ఆరుబయట ఉన్న కార్ వాన్ లో కూర్చుని ఉన్నారని, తనను చూడగానే ఆప్యాయంగా ఆహ్వానించారని చెప్పింది. కొద్దిసేపు తామిద్దరమూ మరాఠీ భాషలో మాట్లాడుకున్నామని, ఆ తర్వాత హిందీ, ఇంగ్లీషు భాషల్లో తమ సంభాషణ సాగిందని చెప్పింది. ఫొటో షూట్ కు ముందుకు రజనీకాంత్ తో క్లోజ్ గా కొంచెం సేపు మాట్లాడటం తనకు చాలా ప్లస్ అయిందని, ఎలాంటి టెన్షన్ లేకుండా ఫొటో షూట్ లో పాల్గొన్నానని చెప్పింది. రజనీసార్ కనుక అంత ఫ్రీగా మాట్లాడకపోతే మాత్రం తాను సెలెక్టు కాకపోయి ఉండేదాన్నంటూ తమిళ సూపర్ స్టార్ పై రాధికా ఆప్టే ప్రశంసలు కురిపించింది.

  • Loading...

More Telugu News