: కదులుతున్న డొంక... ఎంసెట్-2 లీక్ నిందితుడు రమేష్ ను అరెస్ట్ చేసిన సీఐడీ
ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన ఎంసెట్ పరీక్షల్లో వేలల్లో ర్యాంకులు తెచ్చుకుని, ఆపై తెలంగాణ నిర్వహించిన ఎంసెట్-2లో వందల్లో ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థినుల వ్యవహారంపై తీగ లాగిన సీఐడీ పోలీసులు డొంకను కదిలించారు. ప్రశ్నాపత్రం లీక్ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న రమేష్ అనే బ్రోకర్ తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. రమేష్ తో పాటు హైదరాబాద్ వ్యక్తి వెంకట్రావ్, ఖమ్మంకు చెందిన మరొకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వీరిని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీ ఎంసెట్ లో విఫలమై, టీఎస్ ఎంసెట్ లో అనూహ్య ర్యాంకులు తెచ్చుకున్న 60 మంది ట్రాక్ట్ రికార్డును పరిశీలిస్తున్న సీఐడీ, వీరందరినీ విచారించాలని నిర్ణయించింది. వరంగల్, పరకాల, ఖమ్మం, కరీంనగర్ లతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో మకాం వేసిన సీఐడీ అధికారులు విచారణను మరింత వేగవంతం చేశారు.