: శ్రీవారి హుండీ చోరీకి పాల్పడిన తూ.గో జిల్లా యువకుడు
తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి మొబైల్ హుండీ నుంచి చోరీ చేసిన ఓ యువకుడు పట్టుబడ్డాడు. అక్కడున్న సీసీ కెమెరాల ద్వారా శ్రీవారి హుండీలో చోరీ జరిగిందని, చోరీకి పాల్పడిన యువకుడు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన అర్జున్ అని అధికారులు గుర్తించారు. అర్జున్‌ని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకుని, అతడి నుంచి 50 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పోలీసుస్టేషన్‌కి తరలించినట్లు సమాచారం. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.