: వైకాపా ఎమ్మెల్యే వాహనాన్ని ఢీకొట్టిన ఇన్నోవా... తప్పిన పెను ప్రమాదం!


చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే, వైకాపా నేత సునీల్ కుమార్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. పార్టీ చేపట్టిన 'గడప గడపకూ వైకాపా' కార్యక్రమంలో పాల్గొనేందుకు కాణిపాకం వెళుతున్న ఆయన వాహనాన్ని ఎదురుగా వస్తున్న ఇన్నోవా ఢీకొట్టింది. ఈ ఘటనలో సునీల్ కుమార్ వాహనం దెబ్బతింది. అదృష్టవశాత్తూ ఆయనకేమీ కాలేదు. ఇన్నోవాలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి స్వల్ప గాయాలు అయినట్టు తెలుస్తోంది. కొద్దిసేపటి తరువాత సునీల్ అదే వాహనంలో కాణిపాకం చేరుకుని చంద్రబాబు పాలనపై ఇంటింటికీ తిరుగుతూ ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్న వైకాపా కార్యకర్తలతో సమావేశమై చర్చించారు.

  • Loading...

More Telugu News