: చంద్రబాబును కలిసిన సినీ దర్శకుడు బోయపాటి


టాలీవుడ్ దర్శకుడు బోయపాటి శ్రీను కొద్దిసేపటి క్రితం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని కలుసుకున్నారు. విజయవాడకు వచ్చిన బోయపాటి సీఎం నివాసానికి వెళ్లి, కృష్ణా పుష్కరాల్లో నదీమతల్లికి హారతి, హారతి వేదిక, దుర్గా ఘాట్ అలంకరణ, ప్రకాశం బ్యారేజ్ అలంకరణ, అక్కడ కాల్చాల్సిన బాణసంచా తదితర అంశాలపై తన ఆలోచనలను సీఎంతో పంచుకున్నారు. గోదావరి పుష్కరాల్లో బోయపాటి దర్శకత్వంలో తీసిన లఘు చిత్రం అందరినీ ఆకర్షించినందున, కృష్ణా పుష్కరాలు, హారతిపైనా ఆయనతోనే షార్ట్ ఫిల్మ్ తీయించాలని చంద్రబాబు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పుష్కర నిర్వహణ అంశంపై వీరిద్దరూ చర్చించినట్టు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News