: డ్రైవర్ సడన్ బ్రేక్ వేస్తే... సహ ప్రయాణికుడి ప్యాంటు లాగేసిన యువతి!


వేగంగా వెళుతున్న బస్సు కుదుపులకు గురవుతున్న వేళ, కిందపడ్డ తన హ్యాండ్ బ్యాగ్ లోని వస్తువులను ఏరుకుంటున్న యువతి, డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో, అదుపు తప్పి పక్కనే నిలబడి ప్రయాణిస్తున్న యువకుడి ప్యాంటు లాగేసింది. వినడానికి ఫన్నీగా ఉన్న ఈ ఘటన చైనాలో జరుగగా, బస్సులోని సీసీ కెమెరాలు ఈ దృశ్యాన్ని పట్టేశాయి. సామాజిక మాధ్యమాల పుణ్యమాని ఈ నవ్వు తెప్పించే వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. చైనాలోని వూ షాన్ లు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఒంగి తన వస్తువులను ఏరుకుంటున్న యువతి, బ్యాలెన్స్ తప్పి, తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో భాగంగా, పక్కనే నిలుచున్న యువకుడి ఆసరా కోసం అప్రయత్నంగా ఈ పని చేయాల్సి వచ్చిందని నెట్టింట కామెంట్లు వస్తున్నాయి. ఇక దీనిపై పుడుతున్న సెటైర్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉందండోయ్!

  • Loading...

More Telugu News