: ఆమె రాజకీయాల్లోకి రావడం మంచిదే... ఆమె భవిష్యత్ ను ప్రజలే నిర్ణయిస్తారు: 'అసోం ఉక్కు మహిళ' నిర్ణయంపై ఆస్కార్ ఫెర్నాండెజ్
అసోంలో సాయుధ బలగాల ప్రత్యేక చట్టాన్ని రద్దు చేయాలంటూ పదహారేళ్లుగా సుదీర్ఘ పోరాటం చేస్తూ, ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్న ఇరోం షర్మిల ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించడం మంచిదేనని కాంగ్రెస్ సీనియర్ నేత ఆస్కార్ ఫెర్నాండెజ్ అన్నారు. 2000 నవంబర్ లో నిరాహారదీక్ష ప్రారంభించిన ఇరోమ్ షర్మిల ఆగస్టు 9న దీక్ష విరమిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగం ప్రకారం భారతీయులందరికీ ఎన్నికల్లో పోటీ చేసే హక్కు వుంటుందని చెప్పిన ఆయన, వారిని ప్రజా ప్రతినిధులుగా అసెంబ్లీకి పంపించాల్సిన బాధ్యత ప్రజలదేనని ఆయన చెప్పారు. ప్రజాస్వామిక దేశంలో సొంత నిర్ణయాలు తీసుకొనే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అయితే తమ ఆలోచనలకు తగ్గ పార్టీని స్థాపించుకుంటారో, లేక ఏదైనా పార్టీలో చేరతారో వారే నిర్ణయం తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు.