: పక్కింటి కుర్రాడు విదేశాల్లో విద్యకు వెళ్లడం ఇష్టం లేని మహిళ... అతని లగేజ్ లో బాంబుందని ఫోన్ చేసింది!


సిడ్నీ వెళ్లనున్న విమానంలో బల్ రాజ్ సింగ్ అనే యువకుడి లగేజ్ లో పేలుడు పదార్థాలు ఉన్నాయంటూ ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. దీంతో కాసేపట్లో బయల్దేరనున్న సిడ్నీ ఫ్లైట్ కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న బల్‌ రాజ్‌ సింగ్‌ ను అధికారులు అదుపులోకి తీసుకుని, అతని పాస్ పోర్టు, వీసా, లగేజ్ చెక్ చేశారు. క్షుణ్ణంగా తనిఖీలు పూర్తయిన తరువాత అక్కడే ఉన్న అతని కుటుంబ సభ్యులకు ఫలానా ఫోన్ నెంబర్ నుంచి బల్ రాజ్ సింగ్ లగేజ్ లో పేలుడు పదార్థాలు ఉన్నాయంటూ ఫోన్ వచ్చిందని తెలిపారు. దీంతో ఆ ఫోన్ నెంబర్ ను గుర్తుపట్టిన అతని కుటుంబ సభ్యులు అది తమ పక్కింటి ఆవిడ నుంచి వచ్చిన ఫోన్ కాల్ అని వెల్లడించారు. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, తన కుమార్తె సిడ్నీలో ఉన్నత విద్యకు వెళ్లాల్సి ఉందని, ఆమెకు సీట్ రాలేదని, తమ కుమార్తెకు దక్కనిది పక్కింటి కుర్రాడికి దక్కడాన్ని సహించలేక అలా ఫోన్ చేసినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News