: లవర్ తో ఎంగేజ్ మెంట్ చేసుకున్న బాలీవుడ్ నటి


'క్యా కూల్ హై హమ్ 3' ఫేం, రియాలిటీ షో 'బిగ్‌ బాస్ 9' కంటెస్టెంట్ మందనా కరీమి నిశ్చితార్థం చేసుకుంది. ప్రియుడు గౌరవ్ గుప్తాతో రెండేళ్లుగా సహజీవనం చేస్తున్న మందన ఎట్టకేలకు, అతనితో వివాహానికి సిధ్ధపడింది. ఈ మేరకు గౌరవ్ తన వేలికి తొడిగిన నిశ్చితార్థ ఉంగరాన్ని చూపిస్తూ దిగిన ఫోటోను ట్విట్టర్, ఇన్ స్టా గ్రాం ద్వారా పోస్టు చేసి, తన ఎంగేజ్ మెంట్ ను ఖరారు చేసింది. తుషార్ కపూర్ తో నటించిన సినిమా ఆశించినంత గుర్తింపు రానప్పటికీ, బిగ్ బాస్ షో ద్వారా భారీగా అభిమానులను సంపాదించుకుంది.

  • Loading...

More Telugu News