: జర్మనీలో కలకలం సృష్టించిన దుండగుడు
జర్మనీ రాజధాని బెర్లిన్ లో సాయుధ దుండగుడు కలకలం సృష్టించాడు. స్టెగ్లిట్జ్ ప్రాంతంలోని బెంజ్ మన్ ఫ్రాంక్లిన్ ఛారిటీ ఆసుపత్రిలోకి సాయుధుడైన దుండగుడు ప్రవేశించి కాల్పులకు పాల్పడ్డాడు. ఒక వైద్యుడిపై దాడి చేయడంతో, ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం తనను తాను కాల్చుకుని దుండుగుడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో గాయపడ్డ వైద్యుడికి చికిత్స అందిస్తున్నామని, ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నామని చెప్పారు.