: భారత్ వీసాలకు దరఖాస్తు చేసిన ‘ఉగ్ర’ నేత హఫీజ్ సయ్యద్ వైద్యుల బృందం


జమాత్-ఉద్- దవా (జేయూడీ) చీఫ్, ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ అనుయాయులైన వైద్యుల బృందం భారత్ వీసాల కోసం దరఖాస్తు చేసింది. కాశ్మీర్ లో జరిగిన అల్లర్లలో భారత సైన్యం చేతిలో గాయపడ్డ కాశ్మీర్ ప్రజలకు వైద్య చికిత్సలు చేసే నిమిత్తం, అక్కడికి తాము వస్తామని, తమకు భారత్ వీసాలు మంజూరు చేయాలని ఆ బృందం కోరింది. ఈ నేపథ్యంలో జేయూడీకి చెందిన ముస్లిం మెడికల్ మిషన్ (ఎంఎంఎం) లోని 30 మంది వైద్యులు, పారా మెడికల్ స్టాఫ్ వీసాల కోసం ఆన్ లైన్, కొరియర్ ద్వారా దరఖాస్తులు పంపిందని జేయూడీ మీడియా సభ్యుడు అహ్మద్ నదీమ్ పేర్కొన్నారు. మానవతా దృక్ఫథంతోనే తాము కాశ్మీర్ లో గాయపడ్డ ప్రజలకు వైద్య సేవలందించాలని అనుకుంటున్నామని చెప్పారు. 30 మంది సభ్యుల బృందంలో 15 మంది వైద్యులు ఉన్నారన్నారు. ఎంఎంఎం చీఫ్ కోఆర్డినేటర్ నాసిర్ హమ్దాని మాట్లాడుతూ, తమ వైద్య బృందానికి భారత్ వీసాల మంజూరు విషయమై ఐక్యరాజ్యసమితి, పాకిస్థాన్ ప్రభుత్వం సహాయం కోరతామని అన్నారు. ఇస్లామాబాద్ లోని భారత్ ఎంబసీ అధికారులు తమ వైద్య బృందం దరఖాస్తులను తీసుకునేందుకు నిరాకరించారని, అయినప్పటికీ, ఆన్ లైన్, కొరియర్ ద్వారా వీసా దరఖాస్తులు పంపామని హమ్దాని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News