: లంకను బెంబేలెత్తించిన ఆసీస్ బౌలర్లు... 117 పరుగులకు శ్రీలంక ఆలౌట్!


శ్రీలంకలోని పల్లెకెలలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక కుప్పకూలింది. ఎన్నో అంచనాలతో స్వదేశంలో జరుగుతున్న టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టును ఆసీస్ బౌలర్లు బెంబేలెత్తించారు. కట్టుదిట్టమైన బంతులతో లంకేయులను కాలు కదపనివ్వలేదు. దీంతో లంచ్ విరామానికి 5 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసిన శ్రీలంక జట్టు లంచ్ విరామం తరువాత మరింత పేలవమైన ఆటతీరు ప్రదర్శించింది. దీంతో లంచ్ విరామం తరువాత కేవలం 30 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన ఐదు వికెట్లు కూడా సమర్పించుకోవడం విశేషం. లంకేయుల్లో డిసిల్వా (24), పెరీరా (20), మాధ్యూస్ (15), చండిమాల్ (15) టాప్ స్కోరర్లు కావడం విశేషం. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్ వుడ్, నాథన్ లియాన్ చెరి మూడు వికెట్లు తీసి రాణించగా, మిచెల్ స్టార్స్, కీఫ్ చెరో వికెట్ తీశారు. దీంతో శ్రీలంక జట్టు 34.2 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌట్ అయింది.

  • Loading...

More Telugu News