: ప్ర‌ధాని మోదీపై చ‌ర్య‌లు తీసుకోండి: లోక్‌స‌భ స్పీకర్‌ను కోరిన ఆప్ ఎంపీ భ‌గ‌వంత్ మాన్


ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవత్ మాన్‌పై లోక్‌స‌భ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పిన విష‌యం తెలిసిందే. తాను ఇంటి వద్ద బయలుదేరినప్పటి నుంచి లోక్‌స‌భ లోపలికి వెళ్లే వ‌ర‌కు తీసిన‌ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన అంశంలో భగవంత్ మాన్‌పై సుమిత్రా మ‌హాజ‌న్ చ‌ర్యలు తీసుకుంటామ‌ని తెలిపారు. అయితే, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై కూడా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని భగవంత్ మాన్ తాజాగా లోక్‌స‌భ స్పీక‌ర్‌ని కోరారు. ప‌ఠాన్‌కోట్‌లోకి పాకిస్థాన్ బృందాన్ని అనుమ‌తించినందుకుగాను మోదీపై చ‌ర్య‌లు తీసుకోవాల్సిందేన‌ని ఆయ‌న పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News