: భారత సెలబ్రిటీలకు గాయాలైనట్టు చూపిస్తూ అక్కసు వెళ్లగక్కిన పాక్ కంపెనీ!


ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సహా బాలీవుడ్ స్టార్స్ ఐశ్వర్యారాయ్, కాజోల్, షారూక్ ఖాన్, హృతిక్ రోషన్ తదితర ఎంతో మంది చిత్రాలను మార్ఫింగ్ చేసి, వారి ముఖాలకు గాయాలైనట్టు పాకిస్థాన్ కు చెందిన ఓ కంపెనీ ఆన్ లైన్లో ప్రచారం చేస్తూ తన అక్కసు వెళ్లగక్కుతోంది. కాశ్మీరులో జరుగుతున్న అల్లర్లను అణచివేసేందుకు పెల్లెట్ తుపాకులను సైన్యం వాడుతున్న వేళ, దాన్ని నిరసిస్తూ, పాక్ సంస్థ సెలబ్రిటీల చిత్రాలకు పెల్లెట్ గాయాలైనట్టు చూపుతోంది. ఈ గాయాల్లో అమితాబ్ కన్ను పోయినట్టు, షారూక్ గుడ్డివాడైనట్టు వారి చిత్రాలను మార్ఫింగ్ చేసింది. కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలా పాక్ వ్యాఖ్యానిస్తోందని హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆరోపించిన మరుసటి రోజే ఈ చిత్రాలు ఆన్ లైన్లోకి రావడం గమనార్హం. అల్లర్లను ఆపాలంటే, తమ వద్ద ఉన్న అతి తక్కువ నష్టం కలిగించే ఆయుధం పెల్లెట్ గన్స్ మాత్రమేనని రాజ్ నాథ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. వాటిని కూడా తొందరపడి వాడవద్దని సూచించామని సైన్యాన్ని ఆయన కోరారు. కాశ్మీరాన హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ అనంతరం పరిస్థితులు మారిపోగా, జరిగిన అల్లర్లలో భద్రతా దళ సభ్యులు సహా 45 మంది మరణించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News