: ప్రధాని మోదీ కాన్వాయ్ డ్రైవర్ ఆత్మహత్య... చిత్తూరు జిల్లాలో విషాదం


ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్ లో డ్రైవర్ గా పనిచేస్తున్న చిత్తూరు జిల్లాకు చెందిన కొర్లమిట్టకు చెందిన సోమశేఖర్ (33) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. న్యూఢిల్లీలోని తన క్వార్టర్స్ లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సోమశేఖర్ ను ఇరుగు పొరుగు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సమస్యలే ఆయన బలవన్మరణానికి కారణమని తెలుస్తోంది. 1999లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో చేరిన సోమశేఖర్, తన ప్రతిభతో ప్రమోషన్లు తెచ్చుకుని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ లో పనిచేశారు. గతంలో సోనియాగాంధీకి, ప్రియాంకాగాంధీకి వ్యక్తిగత బాడీగార్డుగా కూడా పనిచేశారు. ప్రస్తుతం మోదీ కాన్వాయ్ లో పనిచేస్తున్నారు. ఆయన మృతదేహాన్ని ఢిల్లీ నుంచి కొర్లమిట్టకు తీసుకురావడంతో ఈ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

  • Loading...

More Telugu News