: ఏపీలో వాహనాలకు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం
ఆన్ లైన్ విధానంలో వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వల్ల అవినీతి తగ్గుతుందని ఏపీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో వాహనాలకు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, శిద్దా రాఘవరావు, కొల్లు రవీంద్ర ఈరోజు ఉదయం ప్రారంభించారు. అనంతరం దేవినేని మాట్లాడుతూ, వాహనదారులకు శాశ్వత నంబరు కేటాయింపు 75 రోజుల నుంచి ఒక్కరోజుకు తగ్గుతుందని, నాలుగు రోజుల్లో హై సెక్యూరిటీ కేటాయింపు జరుగుతుందని ఆయన అన్నారు.