: ఆర్థిక సలహాదారు నియామకంపై కేరళ సీఎం హ్యాపీ
తన ఆర్థిక సలహాదారుగా ప్రముఖ ఆర్థికవేత్త, హార్వార్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గీతా గోపీనాథ్ రావడం పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, కేరళ మూలాలున్న గీతా గోపీనాథ్ సేవలను రాష్ట్రానికి అందనుండటమే దీనికి కారణం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ విషయంలో కేరళ ప్రజలు చాలా అదృష్టవంతులని సీఎం విజయన్ ప్రశంసల జల్లు కురిపించారు. అయితే, విమర్శకులు మాత్రం వేరే విధంగా కామెంట్ చేస్తున్నారు. అధికార సీపీఎం సైద్ధాంతిక భావజాలానికి విరుద్ధంగా ఈ నియామకం జరిగిందని, నూతన ఉదారవాద ఆర్థిక విధానాలను గీత బోధిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ తరహా విధానాలకు కాలం చెల్లిందని, ఈ నేపథ్యంలో ఆమె తన వైఖరిలో ఏమేరకు మార్పు తెచ్చుకున్నారో తెలియదని అంటున్నారు.