: అసోంను వదలని వరదలు.. 12.5 లక్షల మంది నిరాశ్రయులు.. విశ్వరూపం చూపిస్తున్న బ్రహ్మపుత్ర నది


వరదల్లో చిక్కుకున్న అసోం పరిస్థితి రోజురోజుకు మరింత దారుణంగా తయారవుతోంది. వరదలతో ఉప్పొంగి ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నది పలు జిల్లాలను ముంచెత్తింది. ఇళ్లు, పొలాలు నీటమునిగాయి. 12.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. కజిరంగా నేషనల్ పార్కు మొత్తంగా నీట మునిగింది. అందులోని ఖడ్గమృగాలు ఇతర జంతువులు నీటిలో చిక్కుకుని అల్లాడిపోతున్నాయి. మోరిగావ్, జోర్హత్, దిబ్రుగఢ్ జిల్లాల్లో రోడ్లు తెగిపోవడంతో బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలను రక్షించేందుకు రంగంలోకి దిగిన ఆర్మీ చిరాంగ్ జిల్లాలో 200 మందిని రక్షించింది. బొంగైగావ్‌లో వరద నీటిలో చిక్కుకుపోయిన 150 మందిని రక్షించింది. వేలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. కోక్రాఝర్‌లో ఆర్మీ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని 18 జిల్లాల్లో బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. కరెంటు లేక, తిండి దొరక్క ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. పలు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

  • Loading...

More Telugu News