: హైకోర్టును తక్షణం విభజించాలి: టీఆర్ఎస్ ఎంపీ వినోద్
కేంద్రం చొరవ తీసుకుని హైకోర్టును విభజించాలని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ న్యాయవాదులు చేస్తున్న ధర్నాకు మద్దతిచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైకోర్టు ఏర్పాటుకు ఏపీ తాత్సారం చేస్తోందని ఆరోపించారు. తక్షణం హైకోర్టును విభజించి, ఏపీలో ఏపీ హైకోర్టు, తెలంగాణలో తెలంగాణ హైకోర్టు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. న్యాయవాదులు చేస్తున్న పోరాటానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, అది చెప్పేందుకే తాము వారి శిబిరానికి తరలి వచ్చామని ఆయన అన్నారు.