: మల్లన్నసాగర్ నిర్వాసితులపై దాడి అమానుషం: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్
మల్లన్నసాగర్ నిర్వాసితులపై పోలీసులు లాఠీఛార్జి చేసిన ఘటనపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డా.లక్ష్మణ్ స్పందించారు. ఈరోజు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మల్లన్నసాగర్ నిర్వాసితులపై దాడి అమానుషమని అన్నారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. అరెస్టయిన బీజేపీ కార్యకర్తలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మల్లన్నసాగర్ అంశంపై రైతుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.