: విమాన గాలింపు ప్రాంతాన్ని విస్తరిస్తున్నాం: కోస్టు గార్డు ఐజీ


నాలుగు రోజుల క్రితం బంగాళాఖాతంలో అదృశ్య‌మ‌యిన‌ భారత వాయుసేన విమానం ఆచూకీ అంశంపై కోస్టు గార్డు ఐజీ రంజ‌న్ బ‌ర్‌గోత్రా ఈరోజు స్పందించారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. విమానం ఆచూకీ గురించి త‌మ‌కు ఇంకా తెలియ‌లేద‌ని, శిథిలాల‌ను కూడా ఇప్పటివరకు క‌నిపెట్ట‌లేక‌పోయామ‌ని పేర్కొన్నారు. నేవీ, ఎయిర్‌ఫోర్స్‌, కోస్టుగార్డు సంయుక్తంగా సెర్చ్ ఆప‌రేష‌న్ బృందాల‌తో కలసి విమానం కోసం విస్తృతంగా గాలింపు చేస్తున్న‌ట్లు ఆయన తెలిపారు. నౌకాద‌ళానికి చెందిన 13 నౌక‌లు, రెండు కోస్టు గార్డు షిప్‌లు గాలింపు చ‌ర్య‌ల్లో పాల్గొంటున్నాయ‌ని రంజ‌న్ బ‌ర్‌గోత్రా చెప్పారు. విమానం అదృశ్య‌మయింద‌ని భావిస్తోన్న ప్రాంతాల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించాల‌ని ఆదేశించి విమానాల‌ను పంపామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. విమాన గాలింపు చేస్తున్న ప్రాంతాన్ని విస్తరిస్తున్నట్లు తెలిపారు. విమాన ఆచూకీని క‌నిపెట్టేందుకు ఇస్రో సాయాన్ని కూడా తీసుకున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. విమాన శకలాలు లభించినట్లు వస్తోన్న వార్తలను ఆయన కొట్టేశారు.

  • Loading...

More Telugu News